కార్తీక మాసం,పెరిగే చలితో పాటు భక్తి అన్నింతలు పెరుగుతుంది. గుళ్ళు, గోపురాలు భక్తుల సందడి తో, లోపల దేవీ, దేవతలకు కూడా చోటు లేదేమో అన్నంతగా నిండిపోయి ఉంటాయి. ఈ మాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసమట. ఈ నెలలో శివ వైష్ణవ క్షేత్రాల సందర్శన జరిగింది.
2018 సంవత్సరం నవంబర్ర్ 13 నుండి 15 దాకా మూడు రోజులపాటు కొంతమంది మితృలం అంతా కలసి హైదరాబాదు నుండి స్పెషల్ బస్ లో ఉమా మహేశ్వరం, శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం, ఆలంపురం ఇవన్నీ దర్శించుకొని వచ్చాం.
పర్వత సానువులు, ఈ కొండల చీలికలు, ఏర్పడిన గుహలు, సన్నని జలధారలు.. ఇంకా పైన తీగలు అల్లుకొన్న పెద్దపెద్ద వృక్షాలు...ఇలా నల్లమల అడవులలో ఉన్న ఈ క్షేత్రాలన్నీ సరిగ్గా గమనిస్తే ఒక అద్భుతమైన దృశ్య మాలిక అనచ్చు.
మా ప్రయాణం నల్లమల అడవులలో ఉత్తర ద్వార ప్రవేశం తో మొదలై, శ్రీగిరి క్షేత్రం చుట్టి, కిందకు వస్తూ తూర్పు ద్వారం దాటి, మహానంది,అహోబిలం వైపుసాగింది. ఈ రూట్ మేప్ రూపొందించిన మితృడు శర్మ ని అభినందించాలి.
నైసర్గికంగా, ఈ నల్లమల అడవులలో సానువులు ఆది శేషుడు శయనించి నట్లు విస్తరించి ఉన్నాయట. అందులో తిరుమల, అహోబిలం, శ్రీ శైల క్షేత్రాలు.. వరుసగా శిరస్సు నుంచి తోక వరకు స్వయం సిద్ధంగా ఏర్పడ్డాయట. చదువుతుంటే ఒళ్లు పులకిస్తోంది కదూ! గిరులూ తరులూ, ఝరులూ..అన్నీ చుట్టిన ఈ తీర్థ యాత్ర ఎంత పవిత్రమైనది.
మొదట హైదరాబాదు శివార్లలో ఉన్న గ్రామదేవత మైసమ్మ గుడి ముందు ఆపారు మా బస్. అంతా లోపలికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి, కుంకుమ తీసుకుని బస్సెక్కాం.
రెండవది ఉమామహేశ్వరం, శ్రీశైల క్షేత్రానికి ఉత్తరాన ఉన్న ద్వారం. హైదరాబాద్ నుంచి దాదాపు నూరు కి.మీ. దూరంలో, శ్రీ శైలం వెళ్లే దారి లో ఉన్నది. అంతా అటవీ ప్రాంతం. ఇక్కడ ఉమాదేవి శివుని కోసం తపస్సు చేసిందిట. అంతే కాదు పూర్వం మునులూ తపస్సు చేసుకోనేవారట. ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దం లో కాకతీయుల కాలంలో నిర్మించారు.
ఈ ఉమామహేశ్వర ఆలయం కొండమీద ఉంటుంది. కాని వాహనాలు పైదాక వెళ్తాయి. శ్రీశైలం వెళ్లే ముందు ఈ క్షేత్ర దర్శనం తప్పనిసరి అంటారు. కాని ఇన్నేళ్ల లోనూ, శ్రీశైలం మాత్రమే చాలా సార్లు చూసిరావడం అయింది. అక్కడ బయట అమ్మవారికి కుంకుమ పూజ చేయించాము అందరం. తర్వాత లోపల శ్రీ చక్రం లొ ఉన్న అమ్మవారి ని దర్శించాం. బయటికి వచ్చాక, పైనుంచి చూస్తే చుట్టూ చాలా బాగుంది.
ఉమా మహేశ్వరుల గురించి మాట్లాడుతూ మా మితృడు, ఆధ్యాత్మిక పరిణితి ఉన్న ఛాయా మనోహర్ అంటారు కదా, అమ్మవారు 'మహామాయా' మాయా రూపమని, అది దాటి పరమేశ్వరుని చేరటం ధ్యేయమని...చమత్కారం ఏమిటంటే, మళ్ళీ ఆ అమ్మే మనకి దారి చూపుతుంది అని.
మా తర్వాతి మజిలీ ఒకప్పటి 'శ్రీగిరి' నేటి శ్రీశైలం. జ్యోతిర్లింగాల వరుసలో ఇది రెండవది. ఇక్కడ భ్రమరాంబికా అమ్మవారు పధ్ధెనిమిది శక్తి పీఠాలలో వరుస క్రమం లో ఆరవది. మేము అక్కడి కి చేరేసరికి మధ్యాహ్నపు భోజనాల వేళ దాటి పోయింది. అంతా ముందుగా బుక్ చేసుకొన్న కంచి కామకోటి వసతి గృహం చేరుకొని, సామాన్లు పెట్టి, కాస్త ఫ్రెష్ అయ్యాం.
ప్రదూషవేళ...కొందరు అభిషేకాలకు సిద్ధమయ్యారు. కొంత మందిమి సాధారణ దర్శనానికి సీనియర్ సిటిజన్స్ క్యూ లో వెళ్లాం. మల్లికార్జునుణ్ణీ, భ్రమరాంబ నూ దర్శించుకొని బయట కొచ్చాం.
కార్తీక మాసం,శుక్ల పక్షం...పల్చటి వెల్తురు..దీపాల కాంతి తో పోటీ పడుతూంది. నడుస్తూ చుట్టూ శిల్ప సౌందర్యం గమనిస్తూ వస్తుంటే, ఇవతల ఆలయ ప్రాంగణంలో... ఎవరిదో కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతోంది. కాసేపు కూర్చుని లేచి వచ్చేశాం.
ఇక్కడ ఓ చిన్న ముచ్చట...
శంకర భగవత్పాదులు శ్రీశైల మహా క్షేత్రానికి వెళ్ళినపుడు, సంధ్యాకాలమైందిట. అపుడు అక్కడ మల్లె తీగ అల్లుకున్న మద్దిచెట్టును చూశారట. మరి ఈ చరాచర జగత్తంతా తానే అయిన ఆ పరమేశ్వరుడు... ఎలా కనిపించాడంటే...ఆ ప్రదోష వేళలో,
"భ్రమారంబిక చేత ఆలింగినం చేయబడ్డ మల్లికార్జునేశ్వరుడు లా కనిపించాడట."
అక్కడే శంకరులవారు శివానందలహరిని రచించారుట..
వారిలా వర్ణించారు..
*సన్ధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థానాన్తరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలిఙ్గం శివాలిఙ్గితం*
_శివానంద లహరి(50)_
సంధ్యాసమయములలో విశేషముగా వ్యక్తమగువాడు, ఉపనిషత్తులయందు నెలవైయున్న వాడు (వేదాంతమందు చెప్పబడ్డవాడు), వాసుకి ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లువాడూ, సద్గుణములచే తెలుసుకొనబడేవాడు, ప్రేమతో భ్రమరాంబా దేవి చేత కౌగిలించుకోబడినవాడూ అగు శ్ర్రీశైలేశుడు, మల్లికార్జునస్వామిని నేను సేవించుచున్నాను.
శంకరులు అంతర్లీనంగా మరో అర్థమును కూడా చెప్పారు. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే నట.

No comments:
Post a Comment