ఓం నమో భగవతే శ్రీ రమణాయ
శ్రీ రమణులు చెప్పిన కధలు
పెరియ పురాణ కథలు_జ్ణానసంబంధుడు_1
పెరియపురాణం తమిళులు పంచమ వేదం లా భావించే గ్రంధం.
శేక్కిళార్ అనే శివభక్తుడు తమిళంలో అరవైముగ్గురు శివ నాయనార్ల గురించి అప్పటి శైవభక్తి ఉద్యమం గురించి కూర్చి రచించిన మహా గ్రంధం.
పెరియపురాణం రమణ భగవానుని జీవితం తో అనన్యంగా పెనవేసుకు పోయింది అంటారు.
" సర్వాంతర్యామి, సర్వ శక్తిమంతుడు, విశ్వానికి నియంత అయిన ఈశ్వరుని ముందు నిలబడి, నేనుకూడా అరువదిముగ్గురు భక్తుల వలె భక్తితో సుస్థిరుడనగుటకై అనుగ్రహము ను కురిపించుమని అపుడపుడు వారిని ప్రార్థంచేవాడిని." ఇది తరచు శ్రీ రమణులు మీనాక్షి సుందరుల సన్నిధిలో చేయు ప్రార్ధన అని తెలియజేశారు.
ఈ పురాణంలోని జ్ణానసంబంధులు,అప్పర్,సుందరమూర్తి ల కధలను భక్తులకు చెప్పేవారు.
దక్షిణ భారతంలో ఏడు ఏనిమిది శతాబ్దాల తర్వాత గొప్ప భక్తి ఉద్యమం జరిగిందని, దానికి నాయనార్లు, ఆళ్వార్లు శైవ, వైష్ణవ సాంప్రదాయ భక్తిని ప్రచారంలోకి తెచ్చారని, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను, రమణుల కధలు చదివి ప్రేరణ పొంది, ఇంకా వికీపీడియా ద్వారా కొంత,తెలుసుకున్నాను. ఇంకా వీటిలో లో కొన్నటికి ఇంగ్లీషు ట్రాన్స్ లేషన్ చదివాను. ఫలితంగా... నేనే కొంత తెలుగులో రాసుకోవాలని, అవి మీతో పంచుకోవాలని, అనిపించింది. ముఖ్య ఆధారం మాత్రం రమణుల కధలే.
12వ శతాబ్దంలో శేక్కిళార్ అనే కవి చోళ రాజ సంస్థానంలో ప్రధానమైన మంత్రి గా ఉంటూ కుళోత్తుంగ రాజు సహకారంతో పద్య సంకలనం కార్యక్రమం చేపట్ఠాడు.
#పెరియపురాణం పద్య సంకలనం మొత్తం పన్నెండు వాల్యూమ్ లు. ఈ పద్య సంకలనం లో మొదటి ఏడు వాల్యూములు 'తేవారమ్' అంటారు
అయితే ఈ ఏడు వాల్యూమ్ లు సంబంధార్,అప్పార్,సుందరార్ రచనలు.. తమిళ కవిత్వం లో.. వీరు మన 'కవిత్రయం' లా అన్నమాట. సంబంధార్ ది వాత్సల్య భక్తి, అప్పార్ ది దాస్య భక్తి, సుందరార్ ది మధురభక్తి...
తేవారమ్ అంటే భగవంతుని స్తుతించే పద్యమాల. ఈ తేవారమ్ తమిళనాట అన్ని శివాలయలలో పాడే సంప్రదాయం నెలకొంది.
కథాకాలం ఏడవ శతాబ్దం పూర్వార్ధం. జైన,బౌధ్ద మతాలు ఉచ్చ స్థితిలో ఉన్నరోజులు. దక్షిణ భారత ప్రాంతాన ఏలే పాండ్యరాజు
జైనమతం స్వీకరించాడు. రాజప్రాపకం లభించడంతోనే, వేద సంప్రదాయం అడుగంటింది. శైవ వైదికం దైన్యస్థితిని అనుభవిస్తూ ఉద్ధారకుని కోసం ఎదురు చూస్తోంది.
అది కావేరీ నది ప్రాంతం. కావేరీ నదికీ చిదంబరానికి మధ్యనున్న ప్రాంతం. 'శీర్ కాళి' అనే ఊరు. శైవ సనాతనానికి, సంప్రదాయానికి ఆలవాలమైన ఆ ఊరికి ద్రోణీపురం అనిపేరు కూడా ఉంది.
ఇక ద్రోణీపురపు పల్లె పచ్చదనం, అక్కడి ప్రకృతి చేసే సందడి.. రసజ్ఞుడైన కవి హృదయాన్ని దోస్తుందిట. అక్కడి చెరువుల లో పద్మాలు, చేలగట్ల వెంట ఉన్న మడుగుల్లో విరిసే తెల్లకలువలు, పూల తేనెలతో మత్తెక్కిన తేనీటీగల సంగీతం... ఇదీ నేపథ్యం.
ఆ ఊళ్ళో 'శివపాద హృదయుడు' అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య భగవతి. సంతానం లేకపోవడంతో, సంతానంకోసం ద్రోణీపురీశుని ప్రార్థించగా,భగవతి కి శివుడు కలలో కనిపించి, బంగారు గిన్నె లో పాయసాన్ని ప్రసాదించాడు. కొన్నాళ్లకు ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది."
శివపాదహృదయుడు, భగవతులకు పుట్టిన ఆ బాలునికి #ఆళుడయ_పిళ్ళై అని నామకరణం చేశారు. పిల్లవానికి మూడు ఏండ్లు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా..,
ఓనాటి ధనుర్మాసపు ఉషోత్కాలపు వేళ ఒక అద్భుతం జరిగింది. అప్పటికి ఇంకా సరిగా తెల్లవారలేదు. పుష్కరిణిలో స్నానానికి బయల్దేరాడు శివపాద హృదయుడు. చలి అని వారిస్తున్నా వినకుండా వెంటబడిన, కుమారుని తన భుజం పై కూర్చో బెట్టుకొని వెళ్లాడు.
దారి అంతా పొగమంచు తో నిండి నిశ్శబ్దం గా ఉన్నది. ఆలోచనలు, మాటలు లేని ఒక అలౌకిక స్థితి లో నడుస్తూ వెళుతున్నాడు అతను. ఉండుండీ దూరం నుంచి, గాలివాటుగా వినవస్తున్న వేదమంత్రోచ్ఛారణలు, పుష్కరిణి లో స్నానాలు చేస్తూ, ఆడవాళ్ళు పాడే భక్తి గీతాలు.. ధ్యాన మగ్నుడై ఉన్నాడతను.
పుష్కరిణి చేరగానే, కుమారుణ్ణి గట్టు మీద కూర్చో పెట్టి, తను పుష్కరిణి లో స్నానం చేయడానికి వెళ్లాడు. కొద్ది సేపటికి స్నానాదులు అయ్యాక వచ్చి చూసేసరికి పిల్లవాని పెదిమల చుట్టూ పాలచారికలు. ఎవరిచ్చారయ్యా..పాలు అని తండ్రి ఆశ్చర్యం తో ప్రశ్నించాడు. గుడి గోపురం వైపు చూపించాడా పిల్లవాడు. ఎన్నిసార్లు అడిగినా అటే జగన్మాత వైపు చూపించసాగాడు. అంతే కాదు... అందరికీ ఆశ్చర్యం గొలిపేలా, హృద్యంగా ఒక గీతాన్ని పాడడం మొదలుపెట్టాడు. ఛందోబధ్దమైనది కూడా. మూడేళ్ల పిల్లవాడు కవితాగానం ఏమిటి.
అప్పుడర్ధమైంది తండ్రికి. జగన్మాత తన బిడ్డకి పాలిచ్చి ఆకలి తీర్చింది అని. మానవ రూపంలో గురువు లేకుండా, సరాసరి ఈశ్వర సంబంధము చేతనే జ్ఞానోదయమైన కారణంగా, నాటినుంచి జ్ఞాన సంబంధుడని ప్రఖ్యాతి చెందాడు.
మూడేళ్ల పిల్లవాడు తన కవితాగానం తో ద్రోణీపురీశునికి(శివుడు) ప్రీతి గొలిపేలా తన చిన్ని చిన్ని పాదాలతో చిందులు వేశాడు.
అది మొదలు తన తండ్రి భుజాన ఎక్కి చుట్టుపక్కల ఉన్న శివ క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడ తన గాన రసామృతం తో శివుని ప్రసన్నం చేసుకోసాగాడు. ఈ బాలకుడేమో కారణ జన్ముడు సాక్షాత్ పార్వతీ దేవి అక్కున జేర్చుకొని అతడిని ఆశీర్వదించింది. ఒక క్షేత్రం నుంచి మరొక క్షేత్రమునకు పోయే దోవలో శివసందర్సనోత్సాహంతో ఈ పిల్లవాడు పదాలు పాడుతూ, చిందులు వేస్తూ తోటి పథికులను ఉత్సాహ పరచేవాడట.
ఆ సమయంలోనే, నీలకంఠుడనే వైణిక నిపుణుడు సంబంధుని సాక్షాత్ శివునిగా భావించి, సంబంధులు రాసిన గీతాలను తన వీణపై మధురంగా ఆలపించేవాడు. ఇదొక భక్త బాంధవ్యం.
శివపాద హృదయుడు బాల సంబంధునకు సకాలం లో ఉపనయనం చేశాడు. సంబంధుడు గురు ముఖతః చతుర్వేద వేదాంత ఆగమాలను ఆకళింపు చేసుకొన్నాడు.
" సకల వేదాలసారము ' పంచాక్షరీ ' యే అని అనుభవ పూర్వకంగా గ్రహించాడు. పంచాక్షరీ పదికాన్ని నిబద్ధించి గానం చేశాడు."
ఇలా ఉండగా, అప్పరు అనే వృధ్ధుడైన శివభక్తుడు సంబంధులను కలుస్తాడు. సంబంధులోని ప్రౌఢ కావ్యశక్తికి ఆశ్చర్యం పోయి అతని శిష్యుడు అవుతాడు కాని చిన్నవాడైన సంబంధులు అతనిని అప్పర్...అనగా తండ్రీ! అని సంబోధించి అక్కున చేర్చుకొంటాడు.
అప్పర్ మహా శివభక్తుడు. పెరియపురాణం లో అరవై ముగ్గరు నాయనార్ల లో మొదటివాడు. కొంతకాలం జైనమతం తీసుకొని తన సోదరి ద్వారా కనువిప్పు కలిగి తిరిగి శైవమతం లోకి వస్తాడు. అప్పటి ఆతని ఉద్యమ కాంక్ష అధికార ప్రాపకం ఉన్న జైనీయులని తరిమి కొట్డడం (అప్పర్ చరిత్ర విడిగా వివరిస్తాను).
సంబంధులు వంటి మహా భక్తుల తోడు కోసం చూస్తున్నాడు. మరో దైవానుబంధం. ఇద్దరూ కలసి అనేక శంకర క్షేత్రాలను చూస్తూ, స్తోత్రపరమైన సేవలనందిస్తూ ముందుకు సాగి పోతున్నారు.
అది ఏడవ శతాబ్దం మొదటి అర్ధశతం...కాలం. పాండ్యరాజైన కుబ్జపాండ్యుడు మొదట మధురా క్షేత్ర దైవమైన సుందరశివుని భక్తుడైనా, జైనమతాన్ని ఆదరించి, మతం మార్చుకొన్నాడు. కాని అతని పత్ని మహిళేశ్వరి, వారి మంత్రి కులబంధనుడు శివ భక్తులు. మతము మారలేదు. కాని రాజ్యం లో నెలకొని ఉన్న పరిస్థితి కి కలత చెంది ఉంటారు. మంత్రి జ్ఞాన సంబంధుని భక్తి చరిత విని ఉండటంతో మహారాణిని సంప్రదించి జ్ఞాన సంబంధులను తమ రాజ్యానికి ఆహ్వానిస్తారు.
జ్ఞాన సంబంధుడు తన భక్త పరివారంతో పొలిమేరలోనే, వేగవతీ నదీ తీరాన ఏర్పాటు చేయబడిన శైవమఠంలో బస చేస్తాడు. తనను పిలిచిన కారణం మంత్రిని అడిగి తెలుసుకొంటాడు. అక్కడ మీనాక్షీ సుందరేశ్వరుల ఆలయం దర్శించుకొని.. మీనాక్షీ దేవి హృదయం కరిగేలా ద్రావిడ కవితల తెలి దండను సమర్పించాడు.
జ్ఞాన సంబంధుని రాక తెలిసిన జైన సిద్దాంత కర్తలు మారణ మంత్రాన్ని ఒక భీషణ జ్వాలాగ్నిగా అతనిపై ప్రయోగిస్తారు. ఆ శక్తి, సంబంధుని ముందు తనప్రభావాన్ని కోల్పోతుంది. తిప్పికొట్టబడిన ఆశక్తి చివరకు పాండ్యరాజును ఆవహించి జ్వరగ్రస్తుడిని చేస్తుంది. అయితే జైన వైద్యులు నయం చేయగలిగిన బాధ కాదది. మహరాణి పిలవగా సంబంధులు వస్తారు. భస్మ మహత్యం తెలిపే #గేయపదికను గానం చేసి కొంత విభూతి రాజుపై చల్లాడు. కొంత చల్లబడింది రాజుకు.
జైనులు సంబంధుల పై విశ్వాశ పరీక్ష కోరుతారు. అందుకు అంగీకరించిన రాజు సగ దేహం జైన వైద్యులు మిగతాసగభాగం శివదీక్షాపరుడైన సంబంధులు వైద్యం చేయాలి. ఫలితంగా జైనుల వైద్యం పనిచేయక అవస్థపడిన రాజుకు మన సంబంధులు తన మధుర గానామృతం ద్వారా పూర్తి స్వస్థత ఇస్తారు. రాజు సంతోషిస్తాడు.
ఈసారి మరో రెండు పరీక్షలకు రాజుని ఒప్పిస్తారు జైనులు.
మొదటి ది: తాటి ఆకుపై తమ సిధ్దాంతాలను రాసి మంటలో వేయాలి. *"శివుడే పరదైవం... ఓం నమఃశివాయః, శివఃశరణమ్" * అని సంబంధులచే వ్రాయబడ్డ తాటి ఆకు మాత్రము అగ్నిలో వేసినా కాలదు.
ఇక రెండవ పరీక్ష: ఈసారి తాటిఆకులను వేగవతీ నదీ ప్రవాహంలో వదలాలి. సంబంధుడు వెనకటిలా రాసిన తాటి ఆకు ఏదో చైతన్యం ఆవహించినట్లు,నిపుణుడైన నావికుడు నడిపే నావలా ముందుకు సాగింది. జైనులు వ్రాసినది మాత్రం ఏదో సుడిగుండం లో చిక్కుకొన్నట్టు మరి కనిపించలేదు.
పాండ్య దేశం లో మత ప్రక్షాళన జరిగింది. పాండ్యరాజు తిరిగి శైవమతం స్వీకరిస్తాడు. ఓడిపోయిన జైనులకు మంత్రి నేతృత్వం లో శూలారోషం (impaled) చేయబడింది. శైవులు మరీ విజృంభించి, జైన చిహ్నాలైన చైత్యాలను ఆరామాలను ధ్వంసం చేశారు. ప్రక్షాళన తర్వాత, ఆప్రాంతంనికి జ్ఞానసంబంధుని వైభవమునకు చిహ్నంగా శ్రీ జ్ఞానసంబంధ పురము అని పేరు పెట్టారు.
మధురై తర్వాత జ్ఞానసంబంధార్ ఇంకా కొన్ని ఇరుగు, పొరుగు రాజ్యాలలో శైవమతం ప్రచారం చేపట్టాడు. *అప్పర్* తో కలసి అన్ని పుణ్యక్షేత్రాలు, శ్రీ కాళహస్తి, రామేశ్వరం తో సహా సందర్శించాడు.
జ్ఞానసంబంధార్ పుట్టుక కు బ్రాహ్మణుడు కాని,అతనికా బేధ భావం లేదు. తన భక్త బృదంతో ఊరూరా తిరిగినపుడు, యజ్ఞవాటికలలో అగ్ని ఆరిపోతుందని వారి రాకకు అభ్యంతరం చెప్పేవారట,అందరినీ అక్కడికి తీసుకు వెళ్ళి వారిచే పాడించి...చూడండి మీ హోమాలు ఎలా ప్రజ్వరిల్లతున్నాయో అనేవాడట.
ఇక సంబంధార్ కి పదహారేళ్ళ వయసు రాగానే వివాహం తలపెట్టారు..అతనా అల్పాయుష్కుడు. వివాహ తంతు ముగియకుండానే, స్వామి పిలుపు. వధువుతో,మరికొంతమంది తో స్వామి లో ఐక్యమయ్యాడా భక్తుడు. అజరామరమైన తన కవిత్వం ద్వారా వేల సంవత్సరాలైనా చిరస్మరణీయుడు ఆ మాహానుభావుడు.
🙏🙏🙏
జ్ఞాన సంబంధార్ కవిత్వం గురించి..రెండు మాటలు..కొన్ని పద్యాలు
జ్ణాన సంబంధార్ తన మూడవ ఏట పార్వతీ దేవి చనుబాలు తాగడం, ఆశువు గా భగంవతుని గద్యం చెప్పగలగడం అభూతక ల్పనలా కనిపిస్తుంది. అసలు శివ భక్తులైన ఈ అరవై ముగ్గురు నాయనార్లని ఆశ్రయించి ఇలా ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
దీనికి తోడు కేవలం తన భక్తి పాటలద్వారా జైనమతం కూలదోశాడు అన్నదీ తేలికగా నమ్మలేం. అయినప్పటికీ, వ్యక్తులు వాస్తవ చారిత్రక సత్యం కదా. వారి రచనలూ అంతే.
ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. రమణుల కథలు చదువుతూ నేను కొంత పక్కకు వెళ్లే సాహసం చేసాను. భక్తి ఉద్యమం గురించి తరచి తెలుసుకోవాలని అనిపించింది.

సంబంధార్ కవిత్వం ఆత్మాశ్రయ మైనది అంటారు. జన బాహుళ్యానికి అర్ధమయ్యే రీతిలో రాసినా పద్య నడక సంస్కృత నడకను కాస్త పోలి అతిశయంగా ఉంటుంది ట. ఇంగ్లీషు translation వల్ల కాని, అదే మనం తెలుగులో చెప్పుకొన్నా తమిళ మూలానికి పూర్తి న్యాయం జరగదు. జానపద భాషలో సామాన్య ప్రజల్లోకి చొచ్చుకు పోయేవిధంగా ఉంటాయి ఈ గీతాలు. మొదటి సారిగా తమిళ భాష తెలిస్తే ఎంత బాగుండును అనుకొన్నా.
నా అభిరుచి కొద్దీ కొన్ని పద్యాలు,ఇంగ్లీష్ నుండి అనువదించే సాహసం చేసాను
1.అతని చెవులకి కుండలాలు
తాను తిరుగాడేది ఎద్దు పైన
అతని శిరస్సు చంద్రవంక రేఖాకాంతి తో
అలంకరించబడింది
ప్రజ్వరిల్లుతున్న మరుభూమి లో రేగిన బూడిద తో ధవళ వర్ణం లో ఉన్నాడతడు
నా హృదయం హరించుకు వెళ్లి న దొంగ ఆతడు.
విరసిన కమలం లో విరాజమానుడై ఉండే బ్రహ్మ..మన ప్రభువు కి శిరసు వంచి స్తుతిస్తూ స్వాగతించాడా బ్రహ్మపురి నివాశిని.(శివుని)
( సంబందార్ ఊరైన శీర్ కాళి లేదా ద్రోణీపురం పాత పేరు బ్రహ్మ పురి ట... పుష్కరిణి పక్కనే ఉన్నది శివాలయం)
His ears are beringed
He rideth the bull
His head is adorned with the crescent moon's ray
White is he with ash from the burning grounds swept
And he is the thief who my heart steals away
Great Brahma enthroned on the lotus full bloom
erstwhile bowed him down and his glory extolled and singing received the grace of our Lord who dweleth in famous Brahmapuram old.
2. ఓ శ్వేత వర్ణీ...భీతహరిణేక్షిణీ,
ఓ పాండ్యుల మహారాణీ,
పాలుతాగే పసి బాలుణ్ణి, బలహీనుడిని అనుకోకు సుమా,
శతృవులెంత దుర్మార్గులు అవనీ
హరుడు నాచెంత నిలబడి తే చాలు
వారందరి కన్నా బలవంతుడిని నేనే.
3. ఆ బౌద్ధులు, ఉన్మాద జైనులు ఏదైనా వాగనీ,నిందించనీ
ఆ వదరుబోతు తనము వారికే గుణపాఠం కాగలదు
3. ఈ భూమి మీదకొచ్చి..ఎవరైతే భిక్షాటన చేశారో
అతనో దొంగ..నా హృదయాన్ని దొంగిలించుకు పోయాడు.
తనను తరుముకొచ్చిన మదపుటేనుగు..
చర్మాన్ని ధరించాడు కదా! పిచ్చివాడంటారేమో జనాలు తానైతే ఈ మహా బ్రహ్మ పురం అంతా కట్టుబడి ఉండే ఏలిక
4. తను పీఠాన్ని అధిష్టించిన ఆలయంలో....
ధైర్యం కోల్పో వద్దంటూ అతను ఓదార్చుతాడు..
ఎపుడైనా అంతా అయోమయమై,దారులన్నీ మసగబారినపుడు..మన బుద్ది మందగించినపుడు, ఊపిరాడకుండా గొంతున శ్లేష్మం అడ్డుకొన్నపుడు
5. తిరువాయూరు లో ఎక్కడైతే పడచుపిల్లలు నృత్యం చేస్తూంటారో, తోడుగా, మృదంగ ధ్వనులు వినిపిస్తుంటే. వానకురుస్తుందేమోనని కోతులన్నీ చెట్లెక్కి మబ్బులని పరికిస్తాయి.
6. అరూర్ లో ఉండే తండ్రి
నీపై ప్రేమజల్లు కురిపిస్తే కనక
నీ హృదిలో నిజమైన జ్యోతి ఉదయిస్తుంది
బంధాలన్నీ పటాపంచలవుతాయి.
7. అరూర్ లో పవిత్ర మూర్తి యాతడు
అతనిని స్తుతించడం మరవకు సుమా
భవబంధాలన్నీ తెగి పోతాయి
తతిమా ప్రాపంచిక విషయాలు వదిలి వేసి
8. అరూర్ లో మా ప్రియతముడొక మాణిక్యం.
బంగారు కాంతులని విరజిమ్ముతాడు
నీ దుఃఖాన్ని తుడిచి వేసుకో
ఇక నీ ఆనందానికి మరో పోలికే లేదు

No comments:
Post a Comment