ఓం నమో భగవతే శ్రీ రమణాయ
శ్రీ రమణులు చెప్పిన కధలు_
పెరియ పురాణ కథలు(సంక్షిప్త సమీక్ష)
సుందరార్
ఇంతకుముందు మనం చెప్పుకొన్న ముగ్గురు కవులలో సుందరార్ ఆఖరివాడు. ఇతను ఎనిమిదవ శతాబ్దానికి చెందిన కవి. మధుర కవి కూడా. సుందరుడు,శంకరుని తన చెలికాడు లా భావించి కవిత్వం చేశాడు. చెలిమి లోని స్వాతంత్ర్యం ప్రదర్శించాడు. తన ముందు భక్త కవుల్లా విపరీతమైన శుశ్రూష. చేసినట్లు లేదు. అందునా శంకరుడు భక్త సులభుడు కదా...! అందుకే కాబోలు భక్తి ఉద్యమ తీవ్రత సన్నగిల్లిందేమో అనిపిస్తుంది
అంతే కాదు ఈ అరవై ముగ్గురు నాయనార్ల లోనూ ఆఖరి వాడే అన్నట్టు తోస్తోంది. తన పదకవితలలో అందరి పేర్లు పేర్కొన్నట్లు గా ఉంది. అతను రాసినట్లుగా ఈకింది పద్యం.(సోర్స్: వికిపీడియా)
జ్ఞాన సంబంధార్,తిరు నవుక్కరసర్ ఇరువురూ తమిళ భాషా కోవిదులు, నలయిప్పొవన్ జ్ఞాని- సుదన్,సక్కియన్,సిలాంది,కణ్ణప్పన్,కనమపుల్లన్...మొదలైన వారి తప్పులున్నా నీవు ఒప్పుగానే పరిగణించావు
అందుకే నూపుర సవ్వడినై నీ పాదాల చెంత చేరాను
బంగారు కలువల తో కాంతులీను సరస్సు లున్న
'తిరుప్పుంగూర్' నందున్న ఓ ప్రభువా..
భక్త సుందరార్ పుట్టింది తిరునవలూర్ అని చెప్పబడినా, మన రమణులు చెప్పిన పేరు ...అరుణాచలం సమీపంలోని జంబూపురం. బహుశ ఒకటే కావచ్చు.తండ్రి జటిలుడను బ్రాహ్మణుడు, తల్లి జ్ఞానవతి. తిరువూరు లోని ఆలయ శాసనల్లో సుందరార్ తలిదండ్రులు ఇద్దరూ నాయనార్ల ని పేర్కొన్నారుట.
సుందరుడు పేరుకు తగ్గట్టు మహా సుందరుడు. చిన్నపిల్లవాడుగా ఉన్నపుడే చోళ రాజు నరసింహిడు ఆపిల్లవాని చక్కదనానికి ముచ్చటపడి దత్తత తీసుకుంటాడు. రాజ్యాధికారం కూడ ఈయబోగా..అది బ్రాహ్మణ విధి కాదని నచ్చచెప్పి, తీసుకుని పోయి ఉపనయనం చేసి..వేదవేదాంగాలు, అగమశాస్త్రం నేర్పుతాడు.
సుందరార్ పూర్వ జన్మ కధనొకదానిని శ్రీరమణులు చాలా చక్కగా చెప్తారు.
ఒక నాడు పార్వతి పరిహాసానికి శివుని అందచందాలు లేని వానిగా ఎత్తిచూపితే, శివుడు పరమ మోహానాకార రూపములో కనిపించి ఆమెను చకిత ను చేస్తాడు. అప్పుడు తన ప్రతిబింబానికి ఓ రూపం ఇచ్చి 'సుందరుడని' పేరు పెట్టి, *త్వమేవాహం* అన్నట్టు..ఆదరిస్తాడు. అలా ఉండగా సుందరుడు పార్వతి చెలికత్తె ల పట్ల మోహం ప్రకటించగా కోపించిన శివుడు ఆ చెలికత్తెలతో సహా మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు. కాని సుందరునికి గొప్ప కవికాగలడని,అట్లే పూర్వజన్మ జ్ఞానం ఉండేట్టు అభయమిస్తాడు.
ప్రస్తుతం లోకి వస్తే...
సుందరునికి పెళ్ళి నిశ్చయమవుతుంది. యువరాజు తో సమానం కాబట్టి ఘనమైన పెళ్ళి ఏర్పాట్లు జరుగుతాయి. అంకురార్పణ జరిగి సుందరుడు పెళ్లి పీటలమీద కూర్చున్నాడు. అప్పుడు ఉన్నట్టుండి ఒక పండు ముసలి వ్యక్తి వచ్చాడు అక్కడికి. *శివుడో లేక నంది వంటి శైవుడో* అనుకొంటూ అతని రాకకు కారణం అడగగా, సభనుద్దేశించి అతడు సుందరుడు తనకు దాసుడు అని అందుకు ప్రమాణ పత్రము అతని తాత రాసిచ్చినది ఉందని చూపిస్తాడు. ఈ విషయం లో వాదోపవాదాలు, పరీక్షలు అయ్యాక,తప్పనిసరిగా సుందరుడు అతని వెంట వెడతాడు. సరాసరి అతడు ఈశ్వరాలయము లోకి దారి తీసి అక్కడ అంతర్ధానం అవుతాడు. ఈతనికి నిజంగానే మతిలేదు అనుకొంటూ సుందరుడూ చూస్తూంటే ,పరమేశ్వరుడు సకుటుంబంగా దర్శనమిస్తాడు. తనను అంతకుముందు పిచ్చివాడా అని పిలిచినందుకు..అదే మకుటంగా స్తుతి గీతాలు రాయమని, సరస్వతీ అనుగ్రహం ప్రసాదిస్తానని చెప్పి ఆశీర్వదించి పంపుతాడు.
పీటలమీద ఆగిపోయిన పెళ్ళి..కాని సుందరుడలాగే కర్పూరదండలతో పెళ్ళి కొడుకు లాగానే అనేక ద్రావిడ గీతాలు పాడుతూ తిరుగుతూంటాడు.
_అలా పీటలమీద పెళ్ళి ఆపిన శివుడే సుందరుడు పెళ్ళి సంబంధం కుదర్చడానికి రాయబారం నడుపుతాడు...
గమత్తేమిటంటే సుందరార్ కి పెళ్ళి ఆగిపోయినా, తర్వాత ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు జరుగుతాయి. తనకీ భగవంతునికి పోలిక తెస్తూ సరసోక్తి లా ఉండి అతను రాసిన ఈ కవిత చూడండి.
*నీవే సగం స్త్రీ గా ఉన్నావు
గంగమ్మ ఉన్నదేమో నీ దీర్ఘ కేశాల మధ్య
నీకు మాత్రం తెలయదనా
స్త్రీల తో ఇక్కట్లు
*కథ లోకి వస్తే..*
తిరువారూరు గా పిలవబడే కమలాలయములో సుందరుడు అక్కడి దేవుడైన త్యాగీశుని స్తుతిస్తూ, సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఊరి లో నే పరవ అనే దేవదాసీ తన తల్లి తో కలిసి దేవాలాయములో తన నృత్యం చేస్తూ దేవుణ్ణి సేవిస్తూ ఉంటుంది. ఇతిహాసం ఏమిటంటే పరవ, పూర్వం శాపం పొందిన పార్వతి దేవి చెలికత్తెలలో ఒకతె.
పరవ మహా అందగత్తె. సుందరుడు ఆమెని చూసి మనసు పారేసు కొంటాడు. పరవ అదే సమయంలో సుందరుని పట్ల ఇష్టం పెంచుకొంటుంది. సుందరునకైతే భగవంతుని ధ్యాసే లేదు..స్తోత్రాలూ లేవు...పరవే పంచాక్షరీ అయింది. త్యాగేశ్వరుడు తన భక్తుని అవస్త చూడలేక సాయం చేయటానికి ముందుకి వచ్చాడు.సుందరునిక కోరిక మీద దూతగా వెళ్లడానికి ఒప్పుకున్నాడు.సాక్షాత్తూ వారి ఇష్ట దైవమే దౌత్యానికి రావడం తో పరవ, పరవ తల్లికి నోట మాటే లేదు. పరవా సుందరుల వివాహం జరుగుతుంది. నిజానికి వివాహానంతరం సుందరుని గానం ద్రవిడ భాషలో మరింత మాధుర్యాన్ని సంతరించుకొంది.
భగవంతుని కోరిక మీదతన ముందు తరం భక్తుల(నాయనార్లు) జీవిత చరిత్ర గానం చేశాడు.
శ్రీ రమణులు రాసిన కధలో ఇంకా ఇలా ఉంది. శంకరుడు సుందరుడితో..నీవే నేను అన్నట్టుగా ఉంటాడు కదా, తన భక్తునికి భార్య పైగల ప్రేమ, వ్యామోహం వల్ల తనపై భక్తి ప్రదర్శించే తీరు మారడం గ్రహిస్తాడు. అనుదినం ధూళి దర్శనమే అవుతూంటుంది. ఓనాడు తన భక్తుని చేరి మేలమాడుతూ, అతని సంసార జీవితం గురించి తరచి తరచి అడగుతాడు. ఆ తర్వాత సుందరుని మనసు పరిపక్వత నొందేలా ప్రభోదిస్తాడు.
*ఒక చెట్టు పైన రెండు పక్షులు. ఒక పక్షి కింది కొమ్మ మీద కూర్చుని తీయతీయ పండ్లని రుచి చూచి,తరువాత చేదు ఫలితములను పొందుచున్నది. పై కొమ్మ మీద పక్షి ఈ లీలను గమనించుచు సాక్షిగా ఉన్నది. మొదటి పక్షి జీవుడు. రెండవ పక్షి శివుడు లేక ఆత్మ ( ముండకో పనిషత్).*
* చైతన్య స్వరూపమని. ఆనంద సాగరమైన తనను వీడి, సాంసారిక సౌఖ్యములనే నీటితుంపరులకై భ్రాంతి
చెందువారీ జీవకోట్లు .ఇది తెలిసినచో జన్మ రాహిత్యమే కదా!*
సాక్షాత్తూ పరమేశ్వరుని నుంచి ఉపనిషత్ సారాన్ని పొందిన సుందరార్ తర్వాత కమ్మని గేయ రచనలు చేసాడు. సుందరార్ తనకు తనభగవంతునికీ మధ్య సంబంధం లో ఎలాటి హద్దులూ విధించుకోడు. తన జీవితంలో తను చేసిన తప్పులు,ఒప్పులు అన్నిట్లో అతనిని భాగస్వామి ని చేస్తాడు.అందుకు దృష్టాంతంగా రేపటి భాగంలో..సుందరుని రెండవ పెళ్ళి..పర్యవసానం.
సుందరుని భక్తి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. భౌతిక మైన జీవితం పట్ల వ్యామోహం ఉన్నప్పటికీ, హృదయాంతరాళ లో అతనికి భగవంతుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంది. ఏమి కోరినా 'తండ్రి' ని కోరవలసిందే కదా, స్వేచ్ఛ అయినా, నిర్భాగ్యులపై కరుణ అయినా, చందనాది సుగంధ ద్రవ్యాలైనా, బంగారమైనా. అంతెందుకు ...తను కోరిన యువతి ని పెండ్లాడానికైనా. పరమేశ్వరుడొక్కడె అతనికున్న ఆధారం. భగవంతుని, భగవత్ భక్తులను కీర్తించడమే అతని నిత్యకృత్యం.
అనేక క్షేత్రాలను సందర్శిస్తూ..తన సంకీర్తనలన తో అక్కడ వెలసిన దేముణ్ణి స్తుతిస్తూ..ఇలా సంచారం చేస్తూ అతడు అమృతఘటేశ్వరం,ఛాయావనేశ్వరం శ్వేతవనం, విశాలనగరం దాటిపోతూ..అడవి దారుల తిరుగాడుతూ...ఒక చోట విపరీతమైన ఆకలి దప్పులతో అలమటించసాగాడు. దయాళుడైన శంకరుడు బోజనం ఏర్పాటు అయ్యేలా చూస్తాడు. మరొక సారి శంకరుడు తానే బిచ్చమెత్తి తన భక్తుని ఆకలి తీరుస్తాడు. అక్కడనుంచి కాంచీపురం, ఆపైన శ్రీ కాళహస్తి,
శ్రీబంధకపురం చేరు కొంటాడు .
అక్కడకి దగ్గరలోనే భానుపురం అనే ఊరిలో ఒక వృద్ధ దంపతులకు శృంఖల అనే కూతురు ఉంటుంది. పూర్వం శాపం పొందిన పార్వతీదేవి ఇద్దరు చెలికత్తెల లో రెండవది. యుక్తవయసు లో ఉన్న సౌందర్యరాసి. శివభక్తురాలు. మన సుందరునికి పూర్వవాసనలు ఎక్కడికి పోతాయి. ఆమె పై ప్రేమ, ఎలాగైనా ఆమెను పొందాలని ఆరాటం. సుందరుని పరవా ప్రణయావేశం తెలిసికొన్నది కనుక, పెళ్లి అయినవాడని ఆమె నిరాకరిస్తుంది.
శివుడా అభయశంకరుడు..తప్పేదేముంది తానే మధ్యవర్తిత్వం నెరుపుతాడు. పెళ్ళి అయ్యాక తనని వదలి ఉండనని శపథం చేస్తే అలాగే నని చెప్తుంది. ఇక్కడ భక్తి, రక్తి రెండూ పోటీ పడతాయి. అలాగే నని తను శపథం చేస్తానని ఒప్పుకుంటాడు సుందరుడు. ఈ వార్త మోసుకొచ్చిన శంకరుణ్ణే కోరుతాడు
'రేపు నేను నీ లింగం దగ్గర శపథం చేస్తాను. కాని నీవొక సహాయం చేయాలి...నేను శపథం చేసే సమయంలో, ఆ లింగంలో ఉండకుండా బయట ఉన్న పొగడచెట్టు లో ఉండు' అని.
పరమశివుడు అలాగే నని, శృంఖల దగ్గర కు వెళ్లి అంటాడు కదా... లోపల గుళ్లో లింగం దగ్గర కాకుండా, బయట పొగడ చెట్టుదగ్గర ప్రమాణం చేయమని కోరమంటాడు.
సుందరుడు విథి లేక అలాగే శృంఖల కోరుకొన్నట్లు ప్రమాణం చేస్తాడు. వివాహం అవుతుంది. కొన్నాళ్ళు శ్రీబంధకపురంలో, శృంఖలా బద్ధుడై జీవితం సాగిస్తాడు.
వసంతకాలం వచ్చింది..కోయలలు కూసాయి..సుందరునకు తన ఊరి కోకిలపాట గుర్తుకొచ్చింది....వెన్నల జాబిలి....అలాగే పరవ. ఇక మనసు నిలవలేదు. శివుని ఎదుట శృంఖలకు తానిచ్చిన వాగ్దానాన్ని మరచి శ్రీపురం బయలుదేరాడు సుందరుడు. ఊరి పొలిమేర చేరుకోగానే సుందరునికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి అంధత్వం వచ్చింది..ఆపైన శరీరం లో కుష్ఠు రోగము. మతిపోయిందీ పరిణామంతో. శివుని వేడుకొంటాడు .యథాస్తితి ఇవ్వమని. శివుడు స్పందించడు. చిరాకుతో
' అసలు నువ్వున్నావా?' అంటూ రంకెలు వేస్తాడు.
సుందరార్ భక్తి మధుర భక్తి అని చెప్పుకున్నాము కదా. అంతమాత్రాన అతనిని కాముకుని గా పరిగణించడానికి వీలులేదు. కొంతమంది అతని ని సాక్షాత్ త్యాగీశుడుగాను కొంతమంది త్యాగీశుని సన్నిహితుని గాను భావించేవారట.
సుందరార్ కి తన భక్తి ఏమో తనేమో అన్నట్టు తను నమ్ముకొన్న దైవాన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ.. తానా చంద్రశేఖరునికి దాసుడనే చెప్పుకొంటూ...ఎప్పటికప్పుడు పునరంకితం అయ్యేవాడు.
*ఆహా పాపిని కదా,నిర్మలమైన ప్రేమ,సేవా మార్గమును వదిలావు కదా
నాకున్న రోగము, బాధ ఏమిటో ఇప్పుడు తెలిసింది
నేను వెళ్లి కొలుచుకోవాలి నా తండ్రి ని...మూర్ఖుడిలా..ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగానో..నీనుంచి దూరంగా..*
పశ్చాత్తాపం తో ఇలా ప్రార్థనలు చేశాడు.అలా అతడు కంచి చేరి ఏకామ్రేశ్వరుడుకి ప్రార్ధిస్తే ఎడమకన్నుకు మాత్రం చూపునిస్తాడు. అలాగే కుర్తాళం చేరి అక్కడ ప్రార్ధించి భగవదాజ్ఞ మీద అక్కడి తీర్ధం లో స్నానం చేయగానే చర్మవ్యాధి నయమవుతుంది. చివరకు శ్రీపురం చేరి త్యాగేశుని పరిపరివిధాల ప్రార్ధించి...తన రెండవకంటి చూపుని పొందడమేకాక ,తన భార్య పరవను పరమేశ్వరుని ఆశీర్వాదం తో తిరిగి పొందుతాడు.
*పంచ భూతాలు గతులు తప్పచ్చు, తన సతికి సహదేహమిచ్చిన పరమేశ్వరుని పాదపద్మములు విడువకెన్నడూ.
ప్రీతి తో ఈశును స్తుతించే నియమమూ విడువకు.*
*నాశనం లేనిది, తిరిగి పొందలేని సంపదేయితే ఉందో అదే
కలిగి ఉండు
బంగారమైనా,ఇటుకరాయైనా ఒకలాగే చూడు
పొంగిపొరలే ప్రేమేతో ముకుళితహస్తవై ఉండటం తప్ప దేనినీ ఆశించకు....కడకు, ముక్తి ని కూడా కోరుకోకు*
ఇలా ఇతని భక్తి, కీర్తి .....తిరువూరు వచ్చిన చేరరాజు కు తెలుస్తాయి. సుందరార్. చేరరాజు మంచి మిత్రులు అవుతారు. ఇద్దరూ కలిసి అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఇక సుందరార్ జీవితం లో అలుపు చెందుతాడు..కైలాసము పై బెంగ ఉన్నట్లు గేయదశకాన్ని రాస్తాడు.
*ఓ తండ్రి, యముడు నాకోసం వచ్చినరోజున
'ఇతడు నాసేవకుడు' అని నిరోధించు
ఒకనాడు ముని కుమారుణ్ణి కాపాడి నట్లే..
నీ పాదాలనంటి వేడుకొంటున్నా...రక్షింపుము*
ఆషాఢ మాసంలో స్వాతి నక్షత్రమునాడు, కైలాసమునుండి అతని కోసం ఒక తెల్లని ఏనుగు(ఐరావతం) వస్తుంది. చేరరాజు కూడా తన గుర్రముపై అతనిని అనుసరిస్తాడు...పరమశివుని అనుమతితో ఆవిధంగా తన మితృనితో శివ సాన్నిధ్యాన్ని చేరతాడు.
*ముక్తాయింపు*
పెరియపురాణం అనే తమిళ పురాతన గ్రంథం చాలా గొప్ప కావ్యం. పూర్తి గా చదవగలగడం..అంతకంటే అర్ధం చేసుకోవడం రెండూ కష్టమే. ఇందులో అరవై ముగ్గురి నాయనార్ల చరిత్ర..వారి గీతాలు ప్రాచీన తమిళ భాషలో ఉన్నాయిట.ఈ నాయనార్లంతా అన్ని వర్గాలకీ చెందినవారు.రకరకాల వృత్తులవారు. కొందరు స్త్రీలూ ఉన్నారు. అందుకనే వారి భక్తిగీతాలు ప్రజల,వారి జన జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి.
పెరియపురాణం తమిళంలో సంకలనం చేసిన శేక్కియార్ ఈ గ్రంధం గురించి చెప్పిన పదాలకు ఇంగ్లీషు నుంచి నా స్వీయానువాదం
*అమర ప్రేమ చవిచూపే మకరందమిది - సేవించు
మనసనే క్షేత్రాన్ని సారవంతంగా చేసే నిరతంతరం పారే ప్రేమ వాహిని యిది-సాగుచేసుకో
మంచిముత్యాలనే సలక్షణాలను రాశులు గా ప్రోది చేసి ఇచ్చే మహా సాగరమిది -వసించు
బంధాలను ఛేదించి విముక్తి నిచ్చే పదునైన ఖడ్గమిది-గట్టిగా పట్టి ఉంచు
జీవితానికి కావలిసిన నైతిక విలువలు బోధించే గురువు-
నీలో దృఢమైన క్రమశిక్షణ పెంపొందించుకో
చారిత్రక సమాచారం పొందుపరచిన నిధి ఇది -నీ జ్ఞానాన్ని పెంపొందించుకో*
శ్రీ రమణులు చెప్పిన కథలు నా అవగాహన పరిథిలో వాటిని క్లుప్తంగా రాసుకొంటూ,ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కూడా కొన్ని విషయాలు రాస్తూ వచ్చాను. పద్యాలు _pdf నుంచి కొన్ని అవసరం మేర అనువదించాను. *ఇక ఏదీ నాసొంతం కాదు*