నైమిశారణ్యం
లక్నో నగరానికి దాదాపు 100 కి.మీ దూరంలో లో ఉంది నైమిశారణ్యం. నవంబర్ నెల 20 తేదీ న కొంతమంది మితృలతో కలిసి ఈ ప్రాంతం సందర్శించాను. హైదరాబాదు నుంచి ఫ్లైట్ లో లక్నో చేరి, అక్కడ ముందుగా మాట్లాడు కొన్న మినీ బస్ లో నైమిశారణ్యం వచ్చాం. నైమిశారణ్యం గురించి చాలా మంది ద్వారా వినడమే కాదు..భాగవతం లోనూ నైమిశారణ్యం ప్రశంస చదివాను
అరణ్యాలలోనే ' నైమిశ' మనే అరణ్యం గొప్పదీ పవిత్రమైనది అంటారు.
మాధవీలత అల్లుకున్న గున్న మామిడి చెట్లు, వెలగ, అరటి, పనస,అర్జున(మద్ది),అశోక, చందన,కర్పూర,తిలక, దేవదారు వృక్షాలతోనూ,
ఎరుపు-తెలుపూ చండ్ర చెట్లతో... ముళ్లచెట్లూ, మృదువైన లతలూ, సపర్ణాలూ..అంటే చక్కని ఆకులూ కలిగి ఉందీ అడవి.
పున్నాగ,సంపంగి తెల్ల తామర పూలు ... రకరకాల పూలవృక్షాల తో నిండి, చెలరేగిన పూల పరాగం తో, తేనెల తో నిండి ఉందిట
కను విందు చేసే పక్షులు నెమళ్లు, నీటి పక్షులు కొంగలు, హంసలు, నీటికాకి, ఇంకా గుడ్లగూబలు, చిలుకలు, భరద్వాజ,తిత్తిరి(తీతువు) పక్షులతో కలకలమంటూ.....
ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్ళు, అడవిదున్నలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, లేళ్ళు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, దుప్పులు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలు సంచరిస్తూ ఉండేదిట ఈ అరణ్యం...
మునీశ్వరుల నివాసం అయిన ఈచోటు..అంతటి తాదాత్మ్యం సంతరించుకొందా అన్నట్లు...
వేదవ్యాసుల వారు తన కుమారుడైన శుకుడు అన్నీ వదలి సన్యాసియై వెడుతుంటే ' కుమారా' అని వెనకనించి పిలిచారట. ఆ పిలుపుకు అడవిలో ప్రతి చెట్టూ, కొమ్మా, రెమ్మా,పక్ష్యాదులు సహితం పలవరించినట్లు తన్మయత్వంతో అరణ్యం అంతా...ప్రతిధ్వనించింది ట...!
వేద వ్యాసులవారు శ్రీమద్ మహాభాగవతం రచించిగా, ఆ మధుర ఫలాన్ని శుకబ్రహ్మ రుచి చూసి రసజ్ణులకు అందించారట
రోమహర్షుని కుమారుడు, పురాణాలన్నీ వ్యాఖ్యానం చేసే పద్ధతి తెలిసినవాడు ఉగ్రశ్రవసుడు అనే సూతుడు, శౌనకాది మునులందరికీ భాగవత కథ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూత మహాముని శౌనికాదులకు వివరించాడుట.
శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే.
శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు.
ఆదిశంకరులు ఇక్కడి లలి తాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.
ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇలా ఒళ్ళంతా కళ్లు చేసుకొని ఎదురు చూస్తూ వచ్చేసరికి... చక్రతీర్థం దగ్గర బస్ ఆపాడు.
చక్రతీర్థం... చక్రం కమ్మీ విరిగి పడిన చోటు.. మునులు తపస్సు కు అనువైనదిగా బ్రహ్మ దేవుడు..చూపిన చోటు.ఈ చక్రతీర్థం చుట్టూ గుడులు ఉన్నాయి.
చాలామంది ఈ తీర్థంలో స్నానాలు చేస్తున్నారు. మేము కాసిని నీళ్ళు నెత్తిన చల్లుకొని..అక్కడ అనువైన చోట ఉసిరి కాయ దీపాలు వెలిగించాం. తీర్థం చుట్టూ ఉన్న మహదేవుని ఆలయం..భూతేశ్వర ఆలయం తో సహా ఉన్న అన్ని ఆలయాలు చూసి..అక్కడ నుండి బయలుదేరాం.
ఆ రోజునే మేం వెనక్కి వెళ్లాలి. మా బస్ డ్రైవరే మాకు గైడ్ అక్కడ. వ్యాస గద్ది,శుకబ్రహ్మ...సూతగద్ది,లలితామ్మవారి గుడి,హనుమంతుని గుడి,ఇలా మా గైడ్ కమ్ డ్రైవర్ చూపించినవి చూశాం..చూస్తున్నాం..సత్యనారాయణ స్వామి గుడి కడతున్నామన్న చోటు తో సహా. ధధీచి కుండం దూరం ,టైమ్ లేదనీ తీసుకెళ్ల లేదు. ఓ రెండు రోజులు ఉంటే లోపల కి ఇంకా చూసే అవకాశం ఉందన్నారు.
కానీ...
ఏవీ.. అడవి ఆనవాళ్ళు ఎక్కడా?
నిరుత్సాహం కలిగింది. ఇంకా... ఇంకా,అక్కడ వసతి గృహాలు అవీ కడుతున్నారు.ఎంత జనప్రవాహమో....అలా అడవి అంతా మనుషులు వచ్చేశారు... వచ్చేశాం. కొంచెం దిగులుగానే అనిపించింది.

No comments:
Post a Comment