Monday, 4 September 2017

నీ స్నేహితులు నీ ఆకాంక్షలకీ  ప్రతీక అనుకో

నీవు ప్రేమ తో నాటితే,కృతజ్ఞత తో ఫలసాయాన్నిచ్చే సుక్షేత్రం

ఎంచేతంటే ...
ఆకలిదప్పులతో నీవాశ్రయించినపుడు..తను నీ  దాత....మనశ్శాంతి కొరకు తనవద్దకు చేరినపుడు,వెన్నుగాచే కుంపటిలా

అయినా..
తన మనోభావాలను నీతో పంచుకొన్నపుడు...నిర్భీతి గా నీవది అంగీకరించలేనని నీకనిపింవినపుడూ, మనస్పూర్తిగా నీ ఒప్పుదల ఎరుకపరచేటపుడు కూడా..నీ నేస్తమే..

తను మౌనంగా ఉన్నపుడు ...
మీ ఇరువురి హృదయాలు సైతం మూగపోయినపుడు;
ఉద్భవించే  భావాలు, ఆశలు...ఆకాంక్షలు..పంచుకొంటూ కలిగే ఆనందం...ఏ ప్రశంశలకు సాటి

నీ నేస్తం నీకుదూరమైనపుడూ..బాధపడకు.
మైదానం లో దూరంగా నిలబడ్డపుడే తానెక్కాలనుకొన్న పర్వతం ఎంతెత్తో చూడగలగి నట్లు
ఎడబాటుతో నీ ప్రేమ ఎంతో  స్పష్టం అవుతుంది.

అయితే ...
గాఢమైన ఆత్మ సంయోగం మినహా మరే ఉద్దేశంతో  నూ స్నేహం కాజాలదు
ఎందుకంటే ...
ప్రేమ లోని మార్మికతను..బహిరంగ పరచినపుడది...ప్రేమ కానేరదు..పన్నిన వల మాత్రమే..చిక్కుకొనేవి నిష్ఫలాలు

ఇంకా...
అత్యుత్తమమైన దే నీ స్నేహితుని కోసం  దాచు..
నీ లోని ఉత్తుంగ తరంగాలే కాదు ..ముంచెత్తే వరద...తెలియాలి.

స్నేహం అంటే..
గంటల తరబడి..కాలహననం మాత్రమేనా కాదు....గంటల తరబడి...జీవించి ఉండటానికి కూడా తన స్నేహం కోరుకో.
ఎందుకో తెలుసా...
తను నీ అవసరం తప్ప, నీ లో ఖాళీ ని భర్తీ చేయటానికి  కాదు.

ఇహ
మధురమైన స్నేహం లో నవ్వులూ,సంతోషాలు పంచుకోవాలి

ఎలాగైనా
తుషార బిందువులు  లాటి చిన్నచిన్న విషయాల లోనే ఉషోదయాలు కాంచిన  హృదయం సేద తీరేది !

( Your friend is your needs answered by Khalil Gibran....స్వీయానువాదం)