ఉదయరాగం
"ఆగామి శిశిర భయంబుచే జమిలి దుప్పటి కప్పుకొనెనేమొ ప్రకృతి కాంత!"
అని చలి తీవ్రతను తెలియజేస్తారు విశ్వనాథవారు. 'ఋతు సంహారం' లో. ఆంధ్రప్రాంతం లో పొగమంచు ఎక్కువ.. నల్లత్రాచు పైనుండి విడిచిన కుబుసంలాగా, చంద్రుడు రాల్చిన నుసి అన్నట్టు, తెల్లని మబ్బులు తెగిపడ్డట్డూ.. ఉపమిస్తారు ఈ పద్యం లో!
అవునండీ చలి పెరిగింది! టెంపరేచర్ చూస్తే దాదాపు సింగిల్ డిజిట్ ని తాకింది...!
తన ప్రతాపం తెలియ చేయడానికా అన్నట్టు గజగజలాడిస్తోంది చలి!
"ఎల్లజనముల దలసూపనీక వెలయు
నల్ల హేమంత ఋతురాజు యశము దిశల
నావరించెనొ యనంగ మంచగ్గలించె
రోదసి నతంద్ర చంద్రికా రుచిర రుచుల"
(కంకంటి పాపరాజు)
"If winter comes, can spring be far behind?" PB Shelly famously quoted in his 'Ode to the West wind'.
ఇదెప్పటికీ పాతబడని సామెత లాంటిది.
శీతాకాలం వచ్చిందంటే, మరి వసంతం వచ్చినట్టేనట!
ఈ ఎదురు చూపు బాగుంది.
మనకేమో పుష్యమాసం ప్రవేశం తో ఉత్తరాయణం వచ్చినట్లే!
కుచించుకు పోయిన పగళ్ళు,
మండే నెగళ్లు.. !
గోరువెచ్చని సూర్యుణ్ణి కలలు కంటూండగానే వచ్చేస్తుంది వేసవి.
తిరిగి ఎండాకాలం లో ఈ చలికాలపు పొద్దును నెమరు వేసుకుంటాం..!
ఎన్ని కాంట్రాడిక్షన్స్!
చూస్తూ.. చూస్తూ యేడాది చివరి రోజుకి వచ్చేశాం. 2025 కి ఈ రోజుతో వీడ్కోలు పలికి, రేపటి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం! 2026 లో మళ్లీ కొత్త ప్రయాణాలు.. ప్రణాళికలు!
ఈ సారి రూట్ మాప్ యిలా ఉండాలిట..
ఒక మిత్రురాలు పంచిన జ్ఞానం యిది.
"గమ్యం -బ్రహ్మ
లక్షణం- సత్యం,జ్ఞానం, అనంతం బ్రహ్మ
మార్గము- సత్యం పరం ధీమహి
నిత్య స్మరణ- దేహోనాహం బ్రహ్మైవహం"
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!








