"అయ్యో 'శివ శివా!'
అని యింకా అననే లేదు"
అనుకున్నదేమో చలి..
వెనుదిరిగి కిటికి రెక్కలగుండా
లోపలికి చొచ్చుకు వచ్చింది;
కమ్మిన పొగమంచు నే భుజాల మీదుగా లాక్కుని కప్పుకొంటూ..
విహారానికి వచ్చిన నాకు..
శిశిరం రెక్కలల్లార్చిన పక్షిలా, తెలిమంచు విదిల్చింది!
మంచు బిందువొక్కటి..
ముక్కుపై రాలి ముద్దు చేసింది!