కాశీ వాసం
"పరా, వైఖరీ ప్రయాణమైనాయి
ఆయన రూపం చూచి వచ్చి చెబుదామని
సింధువు చూడాలని గంగ వెళ్లినట్లు."
(అమృతానుభవం- జ్ఞానదేవ్)
సరిగ్గా అందరం ఇంతే.. కాశీవాసానంతరం ఏదైతే వుందని అనుకుంటామో.. అదీ లుప్తమైపోతుంది!
తొమ్మిది రోజుల కాశీవాసం తరువాత మొన్న శనివారం15th November'25- సాయంత్రం తిరిగి వచ్చాను.
గంగా స్నానం, డూంఢి గణపతిని,సాక్షి గణపతిని వేడుకుంటూ--కాశీ విశ్వనాథుడు, విశాలక్షీ,అన్నపూర్ణలను దర్శించుకోవడం.
"సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో.." -
విశ్వనాథుని సందర్శన కోసం విధిగా సాగించిన నడక ప్రదక్షిణ కాగా, మేమాడుకునే మాటలన్నీ స్తోత్రాలే అయి; ఆనందవనమనే కాశీ సందర్శనం లో మనసూ శరీరం మరో ఆలోచన లేని స్థితి కి వచ్చేస్తాయి.
ఇక పోతే, సత్రం లో భోజనం, మఠంలో అలుపెరగని నిద్ర .. ఇదండీ మా నిత్యకృత్యం. చూడదగ్గ వన్నీ చాలా వరకు చూశాం .. శ్రీనాథు మహాశయుడు అన్నట్టు‘ప్రాయమింతకు మిగుల గై వ్రాలకుండ’ ఇప్పుడైతే తిరగాను కాని, ఇకముందు శివయ్య దయ!🙏🌺🌺

.jpg)
No comments:
Post a Comment