ఉదయ రాగం
🍂🍁
నా ఉదయపు నడక లో
ఈ రాలిన 'పున్నగ పూలని' ఏరుకున్నా దారిలో..
ఎంత పరిమళం!
ఏరుకున్నది పూలను కాదు కొన్ని ఆనంద క్షణాలు- without any attachment..
'dedicating the first hours of the day to 'puttering'- makes me smarter and improve the energy levels all day long'-
Jeff Bezos,the Amazon founder.
ఉదయాన్నే ఫోన్ ని పక్కన పెట్టి, ఓ గంట సేపు చేసే కాలక్షేపమే 'puttering'-
అదీ ఆహ్లాదకరమైన పనే..
అంటే నిర్దిష్టంగా ఈ పని అని కాకుండా..
ఏ పనైనా చేయడం- నిదానంగా కాఫీ తాగడం, పేపర్ తిరగేయడం కూడా ఈ కోవ లోకే వస్తాయి.
మరేమో నేనైతే దీన్ని 'me time' అన్నాను.
ఎక్కడో కనిపించకుండా పక్షి పిలుపు..!
గాల్లో గిరికాలు కొడుతూ.. రాలుతూన్న పండాకు !
"పతితైః పతమానైశ్చ." రామాయణ శ్లోకం గుర్తుకొస్తుంది యెప్పుడూ!
ఇలా రాలినవి, రాలబోతున్న పూలను చూసి.. 'సమీరుడు ఈ పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్టు ఉంది కదా ...!' అంటాడు శ్రీరాముడు లక్ష్మణుడితో.
"పతితైః పతమానైశ్చ పాదపస్థైశ్చ మారుతః
కుసుమైః పశ్య సౌమిత్రే! క్రీడన్నివ సమంతతః"
అది ఎటువంటి సమయం! అరణ్యం లో సీతా వియోగం తో గడుపుతున్న కాలం.
అయినా ఆ క్షణం గురించి.. ఆ చిన్ని, చిన్ని ఆనందాల గురించి వాల్మీకి చెబుతూనే ఉంటారు.. ' సీతే వుంటే..!' అన్న ఊహతో బాటు రాముణ్ణి మరింత కర్తవ్యం దిశ గా ఆలోచింప చేస్తూ ఉంటాయి..!
శుభోదయం అందరికీ🙏🌷🌷🌷

No comments:
Post a Comment