తొలకరి వాన లో తడిసి కరుగుతున్న ఎర్రమట్టి....
దాని తాలూకు పరిమళాలు...
నీరు, మట్టి...కలిసిపోయిన..ఎర్రమట్టి నీళ్లు
కలిసిన వారి ప్రేమైక హృదయాలలాగే..
ఈ పరిమళాలు ఎలా అందాయి? నాకా భాష తెలీదు..భావం అంతూ పట్టలేదు. పాట కట్టి పడేసింది.
యాయుమ్ యాయూమ్...యూట్యుబ్ లో సిక్కిల్ గురుచరణ్ చక్కని ఆలాపన తో మొదలైన ఈ పద్యం(పాట?) తేనెల సోనలా.. తాకింది......
"అంబుదై........నెన్జం .....థామ్ కలన్ ధనవె"
"వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆమెకేమో తమ ప్రేమ ఫలిస్తుందా లేదా అని బెంగ. అతడామెకు ధైర్యం చెప్తున్నాడు.తమది మేనరికం కాదు, ఎలాటి బంధుత్వం లేదు అయినప్పటికీ, తమనెవ్వరూ వేరు చేయలేరనీ...వర్షపునీరు ఎర్రమట్టి లో కలిసి ఎర్రనీరుగా మారినట్లు... తమ ప్రేమైక హృదయాలు కలిసే ఉంటాయని."
లింక్ పోస్ట్ చేస్తూ నా తమిళ ఫ్రండ్ ని అడిగాను. నేనది ఇంకా మళయాళం అనుకొన్నా. అది ప్రాచీన తమిళ భాషకు చెందిన సంగం సాహిత్యం లోనిది అని,అందులో పదాలు తనకూ అర్ధం కావని చెపుతూ..సొంతంగా తనూ సెర్చ్ చేసి..అన్ని వివరంగా ఉన్న ఒక బ్లాగ్ లింక్ పంపింది.
"yaayum ngyaayum yaaraagiyaro?
endhaiyum nundhaiyum emmuraik kelir?
yaanum neeyum evvazhi aridhum?
sembulap peyal neer pola
anbudai nenjam thaam kalandhanave"
My mother and your mother,
what kinship are they?
My father and your father, how related are they?
I and you, how do we know each other?
Like red soil with rain water
Earnest hearts in love became one forever
సంగం సాహిత్యం దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. నా వెతుకులాట లో తెలిసింది ఏమిటంటే. సంగం సాహిత్య సంకలనం లో దాదాపు ఐదు వందలు పైగా కవులు ఉన్నారు. చాలామంది అజ్ఞాత కవులు. వీరంతా సంగం గా ఏర్పడి తమతమ కవిత్వం ప్రచురించే వారట. ఇటువంటి సభలు నేటి మధురై లో సముద్రం లో కలిసిపోయిన భాగంలో.... రెండుసార్లు, మూడవసారి మీనాక్షి అమ్మవారి గుడి ప్రాంగణంలో స్వర్ణ కోనేరులో జరిగాయి ట. (ఎలాటి నిరూపణ లేదుట). కాని సాహిత్యం ఉందిగా.. ఈ సాహిత్యం తమిళుల సంపద.ఈ సాహిత్యం ముఖ్యంగా ప్రేమ, యుద్ధం, ప్రజాపాలన, వ్యాపారం మరియు ఎడబాటు వంటి విషయాలపై ఉన్నాయి.
పురాతత్వ ఆధారల ప్రకారం మదురై ఇంకా సంగంకి సంబంధించిన శాసనం 10వ శతాబ్దానికి సంబంధించినదే ఆధారంగా ఉంది.
ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసింది.
http://www.kutcheribuzz.com/kb-special/kb-interviews/291-exploring-new-worlds
https://youtu.be/rjqbJQA3XAs
10/03/2018

No comments:
Post a Comment