ఒక జ్ఞాపకం
నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటిపటీ గందేభ వాటీ పటీ
రనటీ హారి సువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్ ,
కన దామ్నాయ మహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!
ఈ పద్యం నీకు తెలుసా అని అమ్మ నన్ను అడుగుతూ, తిరిగి తనే ఆ పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పింది.
టి.వి. లో ఏదో సినిమా ఫంక్షన్. సాధారణంగా ఏదో కళ్లప్పగించి చూడటమేగాని, ఏ జరుగుతోందో బుర్రకెక్కదు.
అలాంటి టైమ్ లో పూర్తి గా శబ్దాలంకారం ఉన్న పై పద్యం వల్లించారెవరో..ఎవరోకాదు...రచయిత... తనికెళ్ళ భరణి.
ఇది జరిగిన కొన్నాళ్ళకు.. అమ్మ వెళ్ళి పోయింది. ఇప్పటికి ఐదేళ్లు అయింది. కాని నాకు ఆనాటి ఈ పద్యం మనసులో మెదులుతూ ఉంటుంది.
మా అమ్మ గొప్ప సాహిత్య అభిమాని. భాగవతం లో పద్యాలన్నీ నోటికి వచ్చు. ఎపుడైనా మేము తడుముకొంటుంటే ఆ మాత్రం తెలియదా అన్నట్టు చెప్తూ ఉండడం మాకు అలవాటే. ఆవిడకు ఇష్టమైన పద్యాలలో, మందార మకరంద మాధుర్యము....కూడా ఒకటి.
నేడు అమ్మ పుణ్య తిధి..పద్యాలతో ఆవిడకు ఉన్న పరిచయాలలో ఇదో గుర్తు.

No comments:
Post a Comment