పింక్ ట్రంపెట్ ట్రీ
'చెర్రీ బ్లాసమ్' రుతువు వచ్చేసింది!
ఆ చెట్టు ఉదయపు నడకలో నా అశ్వత్థ వృక్షం;
కొత్త 'వలసపక్షి' రాగానే --
ఆకుల గలగలలాడతాయి!
నాకు అడుగు ముందుకు పడదు-
అది కనబడదు..!
ఆకులన్నీ రాలుస్తూ.. గాలి కబుర్లు పోగేసుకుంటుంది..
నేనెప్పుడూ శ్రోతనే!
తానేమో-తనువెల్లా వసంత కాంతులీనుతూ 'హనామీ' ఉత్సవానికి ముస్తాబయింది యిప్పుడు..!
'వసంతం వచ్చేసింది రండహో !
అంటూ 'గులాబీపూల బాకాను' గాలిలోకి ఊదుతోంది!
ఇదిగో నా 'చెర్రీ బ్లాసమ్' రుతువు వచ్చేసింది!
ఇప్పుడిక ప్రతి రహదారి ఈ సంబరం జరుపుకుంటోంది!

No comments:
Post a Comment