మథురా నగరి లో...
వో వెన్నెల రాత్రి..
ఏ మథురయందు నిత్యము శ్రీమన్నారయణుండు చెలగు బ్రియముమై, నా మథుర సకలయాదవ, భూమీశులకెఐఐల్ల మొదలిపురి యయ్యె నృపా.!(భాగవతం)
బృందావనంలో మురళీలోలుని వేణు గానం గురించి,శ్రీ కృష్ణుని రసరమ్య రాసకేళి... ని,
శ్రీ మద్మహాభాగవతంలో ఎంతో హృద్యంగా వర్ణించారు పోతనామాత్యులవారు.
ఆనాటి బృందావనం లో..
తెల్లని, చిక్కని శరద్రాత్రి వెన్నెల పరచుకుని ఉంది.
కృష్ణుడు వేణువు ఊదడం మొదలు పెట్టాడు...
మంద్రంగా మొదలై..
మధ్యమ,తార స్థాయిలలో రాగాలాపనలు చేస్తూ.....
స్వరాలు.. కళలూ, జాతులూ, ఆరోహాణా..అవరోహణములు తెలిపేటట్లు అవ్యక్త మధురంగా సాగింది ఆ వేణు గానం.
ఆ మధుర మంజుల నాదానికి గోపస్త్రీ లంతా బిలబిల లాడుతూ వచ్చారు. ఆనాటి బృందావనంలో.. అది శ్రీ కృష్ణుని రసరమ్య రాసకేళి..!
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురమ్ .
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురమ్ ..
అప్పటి మధురానగరం ఎలా ఉండేదో మనకి ఊహల్లో నే తెలుసు. కాని నేను కేదార్_నాథ్ యాత్ర లో భాగంగా మధుర కూడా చూశాను.
అక్కడికి చేరేసరికి సాయంకాలం అయింది. వేసవికాలం అయినా.. రాత్రికి చల్లబడింది. ఆ పైన పున్నమి రాత్రులు......
భక్తులు చాలామంది పరిక్రమ చేస్తున్నారు. రోడ్డు మీద వొక దుప్పటి లాటిది పరుస్తూ,తీస్తూ, దాని పైన పొర్లుడు దండాలు కూడా చేస్తున్నారు. కొంతమంది వచ్చేపోయే వాళ్లకి మంచినీళ్ళ పాకెట్లు అందిస్తూంటే, ప్రసాదాలు పంచుతూ మరికొంతమంది.
ఆ మర్నాడు దైవ దర్శనం అయింది మాకు.
కాని, నాకు మాత్రం ఆ నాటి రాత్రి ఇలా....
"మఁధురా....ఁధి...పతే.... అఖిలం....మధురం"
ఎంతో మధురమైన గొంతు...వొక పంచెకట్టు ఆసామి ..
దారమ్మట పాడుకొంటూ....
ఊహించని విందులా...!
ఆనాటి వేసవి రాత్రి..వెన్నెల తో పాటూ
అమృత వర్షమూ...!
No comments:
Post a Comment