#
వాల్డెన్ మూసేసారు..! ఈ వార్తకు సంబంధించిన లింక్ నాలాగే పుస్తక ప్రియులైన ఇద్దరు స్నేహితులు వాట్సాప్ లో పెట్టారు.వెంటనే కాస్త బాధ కలిగింది.
ఇది చదివేదాక తెలియదు, ఒడిస్సీ, హుస్సేన్ బుక్ షాప్ లు కూడా ఎప్పుడో మూసేసారని. దాదాపు డెబ్బై సంవత్సరాలు నడిచిన హుస్సైన్ బుక్ స్టోర్ సిటీ లోనే మంచి షాప్. చాలా సార్లు వెళ్ళి కొన్ని పుస్తకాలు కూడాకొన్నా.
వాల్ఢన్ అయితే నేను సోమాజిగుడా బ్రాంచ్ లో పనిచేసేప్పుడు శనివారాలు ఇంటికి వెళ్తూ వెళ్లే దాన్ని. ఆంబియన్సే కాదు, చక్కగా అమర్చిన హార్డ్ కవర్ క్లాసిక్స్, సెమి-క్లాసిక్స్..కొత్త పుస్తకాల వాసనలు, మధ్య మధ్య నచ్చినవి తిరగేస్తూ.. కంటికీ, మనసుకీ విందే. నిజం చెప్పాలంటే నేను వాల్డెన్ లో ఎప్పుడైనా ఎవరికైనా బహుమతి గా ఇవ్వడానికి తప్ప, సొంతానికి కొన్నది తక్కువ. అయినా నాకు పుస్తకాల షాపులు,బొమ్మల షాపులు చూడడం చాలా ఇష్టం.. అదీ ఖాళీ దొరికినప్పుడు మాత్రమే.
చిన్న ఉప సంహరణ;
వెనకటి రోజుల్లో.. కోటి బ్రాంచ్ లో పనిచేసే చిన్నతనంలో, పుస్తకాలను పురుగులా తినేసే ఆకలి ఉన్న రోజుల్లో అయితే నేను తరచుగా వెళ్లినది అబిడ్స్ లోని సెకెండ్ హాండ్ పుస్తకాల షాపులకే. అక్కడయితే అన్నీ పాకెట్ ఫ్రండ్లీ. జెఫ్రీ ఆర్చర్, షిడ్నీ షెలడ్న్,అగాథాక్రిస్టీ..ఇంకా ప్లాటో,రస్సెల్,సార్త్రే లాటి వెస్ట్రన్ ఫిలాసఫీ పుస్తకాలు..ఇవన్నీ నిస్సంకోచంగా అక్కడ కొని చదివినవే. తెలుగు పుస్తకాలకి విశాలాంధ్ర ఉండనే వుంది.
ఒక శకం ముగిసింది. ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే..!
స్వయంగా వెళ్లి పుస్తకాలు ఎంపిక చేసుకునే వ్యవధి ఇప్పటి వారికి వున్నట్లు లేదు. ఏ పుస్తక మేలా లలో నో కాస్త జనం కనబడుతారు. అంతే.
No comments:
Post a Comment