రామేశ్వరం యాత్ర
“I am the Island of Rameswaram, dear friend,
Born out of the shining water of the Indian Ocean..." ____Abdul Kalam(Oceans meet)
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాధేశ్వర ఆలయం ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం రామేశ్వరం. శ్రీ రామ చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించినట్లు చెప్పబడే శివలింగం.
కాశీ కి వెళ్దామను కొంటేనే వెళ్ళి నంత పుణ్యం, కాని రామేశ్వరం అలాకాదు వెళ్దామనుకో కూడదు ఉత్తినే..అనుకొంటే వెళ్లాలి అంటారు. సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి కదా. ఆవిధంగా బంధువుల తో కలసి వెళ్లాను రామేశ్వర యాత్ర.
మేము మొత్తం పదిమందిమి. అంచేత ఒక పన్నెండు సీట్ల వాన్ లో కన్యాకుమారి నుంచి రామేశ్వరం బయలుదేరాం.

రామేశ్వరం ను పంబన ద్వీపం అని కూడా అంటారు.
ప్రధాన భూభాగం తో కలుపుతూ సముద్రం మీద నిర్మించబడిన పంబన వంతెన ఒక అద్భుత కట్టడం. ఈ బ్రిడ్జి కట్టి వందేళ్ళు అయిందిట. ఓడలు రాక పోకలకు అనుకూలంగా రైల్ బ్రిడ్జ్ మధ్యలో ఓపెన్ అవుతుంది. ఈ అపూర్వ నిర్మాణం ఇంజనీరింగ్ ఫీట్ అనుకొంటూ, రోడ్ బ్రిడ్జ్ మీద నిలబడి దిగువగా ఉన్న రైల్ బ్రిడ్జ్ చూస్తూ ఉంటే ఏదో ఆనందం....ఆ టైం లో రైల్ వెళ్తోంది. రైల్ లో ప్రయాణం చేయాలని పించింది. కాని సాధ్య పడలేదు.
అలా పంబన్ బ్రిడ్జి దాటి ఊళ్ళో కి అడుగు పెట్టాం. గుడికి దగ్గరగా ఉన్న హోటల్లో బస.
ఉదయం 6 గంటల లొపు స్ఫటిక దర్శనం చేసు కోవాలి, ఆతర్వాత సముద్ర స్నానం, వెంటనే నూతులలో స్నానం, ఆపైన రామలింగేశ్వరు ని దర్శనం- అది ప్రణాళిక.
తెల్లవారు ఝామునే లేచి హోటల్ రూమ్ లో స్నానాదికాలు కానిచ్చుకొని స్ఫటిక దర్శనానికి వెళ్లాం. ఇది స్ఫటిక లింగం కదా ఏ పరిమాణం లో ఉంటుందో అనుకొంటుంటే, ఓ పూజారి అటూ ఇటూ చూడకుండా తిన్నగా చూడండి స్ఫటికలింగం అని హెచ్చరిక లాటి సూచన ఇవ్వడం మంచిదయింది. స్వచ్ఛంగా..మెరస్తూ అగుపించింది. సర్వ, శర్వ శివ ,స్థాణు...అని విష్ణు సహస్రనామం లో ఉన్నట్టే..శివుని కీ వర్తిస్తాయి. అచలుడు...ఆద్యంతము లేని వాడు సర్వేశ్వరుడు కదా.
మరో ముఖ్యమైన ఘట్టం స్నానాలు
ప్రత్యేకించి రామేశ్వరం అనగానే సముద్ర స్నానం తో పాటు గుడి లో మరో 22 తీర్థాలలో స్నానం చేయాలి అని చాలామందికి తెలుసు. వెళ్ళే దాకా నాకు కూడా అంతే తెలుసు. తిరిగి హోటల్ కి వెళ్లి కావలసిన బట్టలూ అవీ తీసుకొని సముద్రం దగ్గరకి వచ్చామంతా.
'అగ్ని తీర్థం' సముద్ర స్నానం...మొదటి స్నానం. ఎక్కవ లోతు లేదు. అలల పోటూ తక్కువే. కొంచెం.. కొంచెం గా ముందు కి వెళ్ళి చేయి..చేయి పట్టుకొని సరిగంగ స్నానాలు చేస్తున్నారు.
స్నానం చేస్తుండగా గమనించాను. అక్కడ స్నానాలు చేసే వాళ్లలో కొంతమంది ఆడవాళ్ళు, మట్టితో చిన్న చిన్న లింగాకారం ముద్దలు చేసి.....సముద్రపు నీరు దోసిళ్ల తో తెచ్చి అభిషేకం చేస్తున్నారు. చూడ ముచ్చటగా అనిపించింది. బహుశా ఇలాగే సీతాదేవి ఇసుకతో గూడు కట్టి ఉంటుంది.
'సీతమ్మ తన దోసిటి తో మెత్తని బంగారు రంగు ఇసుక ని పోగు చేసి, పసిపిల్లల ఉత్సాహంతో రెండు చేతులా నున్నగా తడుతూ కట్టిన గూడు...లింగాకృతి దాల్చింది. సీతాదేవి చేసిన ఆ సైకత లింగానికే ప్రాణప్రతిష్ఠ చేస్తాడు రాముడు. అంచేతే రామనాధలింగమైంది. రాముడు సేవించిన ఈశ్వరుడు. బ్రహ్మ హత్యా పాపపరిహారమొనర్చిన దేముడు రాముడి దేవుడు శివుడు. శివలింగం కోసం కైలాసం వెళ్లిన హనుమ రావడం ఆలస్యం అవుతుంది.. హనుమ తెచ్చిన లింగాన్ని కూడా అదే ప్రాంగణంలో ప్రతిష్ఠించాడు రాముడు.'
*బావుల దగ్గర స్నానాలు*
మా సముద్ర స్నానాలు అయ్యాయి. అలాగే తడి బట్టలతో గుడిలోకి వెళ్లి లోపల ఉన్న 22 బావుల దగ్గర స్నానాలు చేయాలి. ఈ బావుల దగ్గర తోడి పోయడానికి మనుషులు ఉంటారు. ఏదో ఓ బకెట్ నీళ్ళు అందరిమీదా కలిపి పోస్తారుట అని తెలిసి, పూర్తి బకెట్ పోసే విధంగా మాట్లాడారు మావాళ్లు.
ఇక్కడింకో విషయం తెలియాలి. రామనాధ ఆలయం ప్రాంగణం చాలా పెద్దది..దేశంలో ఉన్న అన్ని ఆలయాలలో కంటే పొడవైన నడవా(ట). ఇందాక అన్నట్టు రామేశ్వరం వెళ్ళి న వాళ్లనెవరిని అడిగినా..స్నానాలు గురించి ....22 బావులలొ స్నానం చేయాలి అంటారే కాని వివరంగా చెప్పరు...అంటే అడిగితే కదా. అన్నీ పక్కపక్కనే ఉంటాయనే అనుకొన్నా నేను కూడా. ఈ 22 బావులు వరుసక్రమంలో ఒకే చోట ఉండవు. అక్కడక్కడా ఉంటాయి.. మొదట మూడు ఒక చోట..మరోచోట కొన్ని ..అలా.
మనకు నీళ్లు పోయాడనికి నియమింపబడ్డ వాళ్ళు సాధారణంగా యువకులు ఉంటారు. అసలే పేద్ద ప్రాంగణం, అన్నిటికంటే పొడవాటి నడవా... వాళ్ళు.. ఒక చోట నీళ్ళు పోయడం అయిపోగానే, మరోచోటికి చకచకా పరుగు లాంటి నడకతో వెళ్తుంటారా..మనం తడి బట్టలతో..వారి వెంబడే వెళ్లాంటే మన శక్తి కూడా చూసుకోవాలి. అన్ని చోట్లా బకెట్ నిండా నీళ్ళు నెత్తిన పోయించుకొంటూ..శివశివా, హరహరా అంటూ...మరో ఆలోచన లేకుండా సాగాం..
"గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు"
అయితే ఇరవై రెండు తీర్థాల పేర్లు ఇలాగే ఉంటాయి.
మొదట మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి ఈ మూడు తీర్థాలు ఉంటాయి. తర్వాత సరస్వతి, గంగ, యమున. ఇలా అన్నీ గుర్తు పెట్టుకొందామన్నా కుదరలేదు. చివర్న కోటి తీర్థం.. 22 వది. ఇక్కడ మాత్రం ఓ చిన్న చెంబుతో నీళ్లు పోశారు. అలా స్నాన ఘట్టం పూర్తయింది.
దైవదర్శనం
పొడి బట్టలు కట్టుకొని అభిషేకం చేయడానికి వెళ్లాం. సంకల్పం వగైరాలు ఆలయంలో బయట చేయించి, అభిషేకం నీరు, పాలు ,కాశీ తీర్ధం..తో సహా ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయించారు. రామనాధేశ్వరుని దర్శనం తర్వాత..పక్కనే అమ్మవారి ఆలయం దర్శించుకొన్నాం. బయటకొస్తుంటే ఎడమవైపు ఆంజనేయస్వామి గుడి ఉంది.అక్కడా దర్శనం ముగించుకొని ఇవతలకు వచ్చాము.
ఇంకా రామేశ్వరం లో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి కదా..
గంధమాను పర్వతం, అబ్దుల్ కలామ్ గారి ఇల్లు, ధనుష్కోటి.. రాముడి పాదాలు. దైవ దర్శనం కాగానే హోటల్ రూమ్ చెక్ అవుట్ చేసేసి. ..వాన్ లొ రామేశ్వరం ఊళ్ళో చూడాల్సిన వి చూసి..మధ్యలో ఎక్కడైనా భోజనం చేసి మధురై వెళ్లాలి. అదీ ప్లాన్.
గంధమాదన పర్వతం..రాముడి పాదముద్రలు నిక్షిప్తమైన చోటు. ఎత్తుగా ఉన్న మెట్లు ఎక్కగలం అనుకొన్న నలుగురం..వాన్ దిగాం. అక్కడ కిందనే చెప్పులు విడిచి వెళ్లమన్నారు..కాని అప్పటికే ఎండ ఎక్కింది...ఆలోచిస్తూంటే, ఒకాయన పైనుంచి దిగుతూ 'ఫర్వాలేదు పైన విప్పవచ్చు ' అన్నాడు. ఆయనకి కాళ్లు కాలడం వల్ల చెప్పారట. సరే మెట్లెక్కి పైకి వెళ్లాం. వెళ్లాక అనిపించింది... చాలా మంచిపని చేశామని. పైనుంచి చూస్తే.. రామేశ్వరం అంతా చుట్టూతా చక్కగా కనిపిస్తోంది. ఇక్కడ రాములవారి పాదముద్రలు రాతిచక్రం పై నిక్షిప్తమై ఉన్నాయి.
స్థలపురాణం ఏమిటంటే...ఈ పర్వతం 'స్ట్రాటజిక్ వ్యూ పాయింట్' అనీ,శ్రీ రాముడు ఇక్కడ నుంచే లంకని గమనించాడని.
అక్కడనుంచి అంత్యంత ప్రముఖ మైన చోటు అబ్దుల్ కలామ్ గారి ఇల్లు. ప్రస్తుతం మ్యూజియం గామార్చి కలాం గారి వస్తువులు, జ్ఞాపకాలు...మొదటి అంతస్తులో ఉంచారు.
ఏ ప్రాంత అస్తిత్వం అయినా ఆ గడ్డ మీద పుట్టిన మహాత్ములతో ముడివడి ఉంటుంది. ఆయన మొదట అంతరిక్ష శాస్త్రజ్ఞుడు, గొప్ప చదువరి., కవి, వైణికుడు..రాజ్యాంగవేత్త...అంతకంటే గొప్ప మానవతావాది వెరసి మన భారతరత్న అబ్దుల్ కలామ్.
కలామ్ గారి మ్యూజియంలో 'Oceans meet' అనే కవితను చదివాను.
రామేశ్వరం భారత భూభాగాన్ని కలుపుతూ హిందూ మహా సముద్రం లో ఏర్పడిన దీవి. అలాగే చైనా మెయిన్ లాండ్ ను కలుపుతూ ఫసిఫిక్ మహా సముద్రం లో ఏర్పడిన మరో దీవి ఫార్మోసా(తైవాన్).
ఇలా ఈ రెండు దీవులు పలకరించు కొంటాయి. తమ ప్రవర చెప్పుకొంటాయి....బుద్ధ భగవానుడు జన్మించిన భూమి భారత దేశం అయితే, కన్ఫ్యూషియస్ జన్మించిన దేశం.. చైనా
ప్రపంచంలో సగం మానవాళి ని కలిగి న ఈ రెండు దేశాలలో, ఈ మహానుభావులిద్దరూ శతాబ్దాల కింద మానవాళికి ఇచ్చిన సందేశాలు....జీవితం,కుటుంబ విలువలు నైతిక బాధ్యతలు
శాంతి సందేశాలు...అజరామరం ...!
రెండు మహాసముద్రాలు, రెండుద్వీపాలు ప్రార్ధించగా...మరోసారి ఆ దివ్యా ఆత్మలు ఇద్దరూ...మానవాళి శాంతి సౌభాగ్యాలు కోరుతూ సందేశమిస్తారు...
ఈ కవిత లో కలామ్ గారి శాంతి కాముకత్వం తెలుస్తుంది
అంత ఎండ లోనూ ఆ మ్యూజియం చూసి ఇవతలకు వస్తుంటే ఎంతో సంతృప్తి కరంగా అనిపించింది.
ఆ తర్వాత రామాలయం, పక్కనే సముద్రం ఒడ్డున న శివలింగం.. సముద్రం లో తేలుతున్న రాయి..ఒకటి చూశాం. రామాలయంలో సీతాదేవి రాముని కి కుడి పక్కన ఉంటుంది. రామరావణ యుద్ధానికి ముందే శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు..అదీ ఇదే ప్రదేశంలో. స్థలపురాణం అక్కడున్న పూజారి గారితో చెప్పించుకొని, తీర్థం తీసుకుని ఇవతలకు వచ్చాం.
ధనుష్కోటి..ghost city... తుఫాను ప్రభావం.. ఊరుఊరంతా ఊడ్చుకు పోయింది. కొన్ని శిధిలాలు..కొన్ని జ్ఞాపకాలు.. అక్కడే రకరకాల గవ్వలు.. పూసలు..లాటి మర్చండైజ్ పెట్టుకొని ఉన్నారా పల్లీయలు..పిల్లలు ఏవో దండలూ పూసలూ కొన్నారు..బేరం చేయకుండా.
తర్వాత... ధనుష్కోటి బీచ్ ...సముద్రం ఒడ్డుకు... కాదు రెండు సముద్రాల ఒడ్డుకు.
బంగాళాఖాతం ఓ వైపూ......మరో వైపు హిందూ మహాసముద్రం...!!..వెరసి చుట్టూ నీలి రంగులో విస్తరించి న అనంతమైన జలరాశి..!
ఎంత విశాలంగా... ఎంత ప్రశాంతంగా ఉందో.. కాళ్ళ కింద ఇసుక మెత్తగా జారిపోతూ..అసలు వదలబుద్ది వేయలేదు.
బంగారు రంగులో మెత్తని ఇసుక. అలల పోటూ, మంద్రంగా వీస్తున్న గాలితో కలసిన సంగీతం వినగలిగిన మనసుంటే.. అంతా రాగమయం.
"The waves and winds joined to sing the song of life in Sri Raga"(_Kalam)
రామసేతు కట్టిన ప్రాంతం.. దాటితే శ్రీలంక. మరీ అక్కడిదాకా వెళ్లలేకపోయాం.
హిందూ మహాసముద్రం ఇంకెప్పుడు చూస్తాం అనుకొని...కాసిని నీళ్ళు తీసి నెత్తిన జల్లు కొన్నాం. (తర్వాత మధురై)

No comments:
Post a Comment